ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఎస్సీ, ఎస్టీజ్ బీసీ మహిళా ఓటర్ల వివరాల ప్రచురణ - కమిషనర్ వి.శ్రీనివాసరావు

ఎస్సీ, ఎస్టీజ్ బీసీ మహిళా ఓటర్ల వివరాల ప్రచురణ – కమిషనర్ వి.శ్రీనివాసరావు

📰 Generate e-Paper Clip

కుప్పం,సెప్టెంబర్ 14 (గరుడ ధాత్రి న్యూస్):

కుప్పం మున్సిపాలిటీ పరిధిలో వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల వివరాలను ప్రచురించినట్లు కుప్పం పురపాలక సంఘం కమిషనర్ వి. శ్రీనివాసరావు తెలిపారు. సి.డి.ఎమ్.ఎ మరియు రాష్ట్ర ఎన్నికల అధికారి సర్క్యులర్ ప్రకారం 32 వార్డులలో గుర్తించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల వివరాల ‘ఫార్మ్-1’ లో స్థానిక తాసిల్దార్, ఆర్డీవో మరియు మున్సిపల్ కార్యాలయాలలో 14 తేదీ సోమవారం బహిరంగంగా ప్రచురించడమైనది. ఈ జాబితాపై ఓటర్లకు ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు ఉన్నచో, వాటిని ‘ఫార్మ్-2,3’ ల ద్వారా తేది: 17.09.2026 లోగా మున్సిపల్ కార్యాలయంలో పనివేళల్లో సమర్పించవలసిందిగా కుప్పం మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!