ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం నందు వైభవంగా వినాయక చవితి ఉత్సవములు

శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం నందు వైభవంగా వినాయక చవితి ఉత్సవములు

📰 Generate e-Paper Clip

శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం నందు వినాయక చవితి సందర్భంగా ఆలయం నందు శ్రీ మహాగణపతి స్వామివారికి ఉదయం పంచామృతములతో మహాభిషేకం నిర్వహించి ధూప దీప నైవేద్యంలు సమర్పించడం జరిగినది. ఈ కార్యక్రమాలలో ధర్మకర్త సభ్యులు K.కవిత చంద్రశేఖర్ పాల్గొన్నారు
సాయంత్రం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తికి వివిధ పుష్పాలు, ఆభరణములతో సుందరంగా అలంకరించి మూషిక వాహనంపై గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
స్వామి వారి ఊరేగింపు కార్యక్రమమునకు చెన్నైకు చెందిన శ్రీ జగన్నాథం గారు పుష్పాలంకరణ ఉభయదాతగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు, సురుటుపల్లి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఊరేగింపు కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!