ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు..
నివాళులర్పించిన దేవాదాయ శాఖ మంత్రి
ఆనం రామనారాయణ రెడ్డి
వరదయ్యపాళ్యెం అక్టోబర్ 2 గరుడధాత్రి :
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, వన్‌నెస్ స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు శ్రీ కల్కి భగవాన్ (విజయ్ కుమార్ నాయుడు) అంతిమయాత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు.
కల్కి భగవాన్ సెప్టెంబర్ 29న చెన్నైలో పరమపదించిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు పోలీస్ గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది.
తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం, బత్తలవల్లం గ్రామంలోని ఏకం క్షేత్రంలో నేటి సాయంత్రం అంతిమ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కల్కి భగవాన్ పార్థివదేహానికి నివాళులర్పించి, అంతిమయాత్రలో పాల్గొని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఆధ్యాత్మిక రంగంలో కల్కి భగవాన్ అందించిన సేవలను మంత్రి స్మరించుకున్నారు.
