చిత్తూరు అక్టోబర్ 2(గరుడ దాత్రి న్యూస్)
చెన్నై హిందూ మహాసభ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమల వెంకటేశ్వర స్వామికి సమర్పించే వాహన సేవ గొడుగులు, పాదుకలకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం హిందూ మహాసభ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొడుగులు, పాదుకలు శ్రీపురం శ్రీ నారాయణీ అమ్మవారి టెంపుల్ లో పూజలు నిర్వహించిన అనంతరం.. తిరుమల చేరుకుంటాయి. యాత్రలో భాగంగా గురువారం రాత్రి గొడుగులు, శ్రీవారి పాదుకలకు బీవీ రెడ్డి కాలనీలోని ఎమ్మెల్యే గారి గృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే పాదుకలను తలపై తీసుకెళ్లారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, తెదేపా మహిళలు పాల్గొన్నారు.
