ePaper
Thursday, June 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకర్ల వెంకట్రామిరెడ్డి, APGEF ఛైర్మన్ కామెంట్స్...

కాకర్ల వెంకట్రామిరెడ్డి, APGEF ఛైర్మన్ కామెంట్స్…

📰 Generate e-Paper Clip

*తాడేపల్లి :*

 

*కాకర్ల వెంకట్రామిరెడ్డి, APGEF ఛైర్మన్ కామెంట్స్..*

 

సీఎం చంద్రబాబు తన పుట్టినరోజు కానుకగా నన్ను డిస్మిస్ చేశారు

 

ఏ సీఎం అయినా‌ తమ పుట్టినరోజు సందర్భంగా ఉద్యోగులకు మేలు చేస్తారు

 

కానీ చంద్రబాబు నాపై కక్ష కట్టి చర్యలు తీసుకున్నారు

 

ప్రభుత్వం మీద ఏ ఉద్యోగి సానుకూలంగా లేడు

 

ఉద్యోగుల్లో తిరుగుబాటు ప్రారంభమైంది

 

సరైన సమయంలో తగిన బుద్ది చెప్పటానికి రెడీగా ఉన్నారు

 

ఇతర ఉద్యోగులను బెదిరించటానికే నాపై డిస్మిస్ చర్యలు తీసుకున్నారు

 

నేను కడప జిల్లాలో నాలుగు డిపోలలో ఎన్నికల ప్రచారం చేసినట్టు అబద్దపు కారణం చూపారు

 

కానీ ఆ డిపో మేనేజర్లు తమ దగ్గర ఎలాంటి ప్రచారం జరగలేదని రిపోర్టు ఇచ్చారు

 

ఐనాసరే ఎలా డిస్మిస్ ఉత్తర్వులు ఇస్తారు?

 

ఉద్యోగులల్లో ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది

 

వారు ఎలాంటి ఆందోళన చేయకుండా ఉండటానికే ఇలాంటి చర్య

 

ఇది పూర్తిగా కక్షపూరిత చర్య

 

2014-19 మధ్య చంద్రబాబు ఉద్యోగులతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అనుకూలంగా ధర్నాలు చేయించలేదా?

 

ఢిల్లీలో ఉద్యోగులను పక్కన కూర్చో పెట్టుకుని మోడీని తిట్డించలేదా?

 

మరి ఇది రాజకీయం కాదా?

 

చంద్రబాబు తో కలిసి ఎన్నికల ప్రచారం చేసిన వారిపై ఎలాంటి తీసుకున్నారు?

 

నామీద తీసుకున్న చర్యలకు నేనేమీ భయపడను

 

ఇంకాస్త గట్టిగా పోరాడతాను

 

గత ప్రభుత్వం ఉద్యోగులకు మంచి చేసినందునే పొగిడాము

 

ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఏం చేసిందని పొగడాలి?

 

పీఆర్సీ, ఐఆర్, సీపిఎస్ హామీల గురించి ఒక్కటైనా అమలు చేశారా?

 

ఒకటో తేదీన కనీసం జీతాలైనా ఇస్తున్నారా?

 

రెండు నెలల నుండి కాంట్రాక్టు లెక్చరర్లకు జీతాలు ఇవ్వటం లేదు

 

గత ప్రభుత్వం ఉద్యోగులకు ఎన్నో మేలు చేసింది

 

కాదని ఏ ఉద్యోగ సంఘం నేత అయినా చెప్పగలరా?

 

కరోనా ఉన్నా గత ముఖ్యమంత్రి ఎంతో మేలు చేశారు

 

హుదూత్ తుఫాను, అమరావతి నిర్మాణం పేరుతో హుండీలు పెట్టి ఈ ప్రభుత్వం వసూలు చేసింది

 

అదే కరోనా సమస్య ఉన్నా గత సీఎం హుండీలు పెట్టలేదు, మా‌జేబులో డబ్బులు లాక్కోలేదు

 

ఒక్క సంవత్సరంలో నే 80% హామీలను గత ప్రభుత్వం అమలు చేసింది

 

గత ప్రభుత్వం వచ్చినప్పుడు, దిగిపోయే నాటికి జీతాలు ఎలా పెరిగాయో చూసుకోండి

 

ఈ ప్రభుత్వం వచ్చాక ఏం మేలు జరిగిందో చెప్పాలి

 

2017 లో నేను పోటీ చేస్తుంటే చంద్రబాబు ఇంటికి పిలిచి బెదిరించారు

 

నా మీద చంద్రబాబుకు ఎందుకంత కోపమో తెలియదు

 

జగన్ కు వ్యతిరేకంగా చాలామంది మెసేజ్ లు పెట్టారు

 

వారిపై కూడా కక్ష కడితే వారి ఉద్యోగాలు ఉంటాయా?

 

గట్టిగా ప్రశ్నిస్తే డిస్మిస్ చర్యలు తీసుకుంటారా?

 

నేను కచ్చితంగా న్యాయపోరాటం చేస్తా

 

ఇతర ఉద్యోగ సంఘాల నేతలను కూడా బెదిరిస్తున్నారు

 

  1. ప్రభుత్వంపై ఉద్యోగుల తిరుగుబాటు ప్రారంభమైంది

 

ఒక్క పిలునిస్తే చాలామంది రోడ్డు మీదకు వస్తారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!