ePaper
Monday, October 5, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికుటుంబ సమేతంగా శ్రీ పద్మావతి అమ్మవారు, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు

కుటుంబ సమేతంగా శ్రీ పద్మావతి అమ్మవారు, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు

📰 Generate e-Paper Clip

తిరుపతి/చిత్తూరు, అక్టోబర్ 1 గరుడధాత్రి న్యూస్

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవస్థానం, కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు.
తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి అచ్చెన్నాయుడికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను మంత్రి ఆప్యాయంగా పలకరించారు.
అనంతరం కుటుంబ సమేతంగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి దేవస్థానానికి చేరుకున్న మంత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ పండితుల నుంచి వేద ఆశీర్వచనం స్వీకరించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.
అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజల అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు, ఆయన కుటుంబ సభ్యులకు ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం దేవస్థానం తరఫున స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని మంత్రికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, దేవస్థానం సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!