ePaper
Sunday, August 9, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కుప్పంలో 10 న. ప్రజా సమస్యల పరిష్కార వేదిక

కుప్పంలో 10 న. ప్రజా సమస్యల పరిష్కార వేదిక

📰 Generate e-Paper Clip

* కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్.
కుప్పం,ఆగస్టు 09 (గరుడ ధాత్రి న్యూస్): నియోజకవర్గ కేంద్రమైన కుప్పంలో నేడు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ తెలిపారు. ఆదివారం ఈ మేరకు వివరాలను విలేకరులకు తెలిపారు. సోమవారం ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కుప్పం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఈ వేదిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుప్పం అర్బన్, కుప్పం రూరల్, గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాలలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలియజేయాలని ఆయన కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!