* టిడిపి తరఫున ఎస్. రాజ్ కుమార్.
* వైసీపీ తరఫున బత్తలపల్లి విజయ్ కుమార్.
* భారత జాతీయ కాంగ్రెస్ తరపున పలని, బహుజన్ సమాజ్ పార్టీ తరపున గణేష్ లు రంగంలో.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 21:గరుడ ధాత్రి న్యూస్: కుప్పం మున్సిపల్ ఎన్నికల వ్యవహారం రసకందాయంలో పడింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బుధవారం సాయంత్రం కుప్పం మున్సిపల్ చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటించారు. బహుజన్ సమాజ్ పార్టీ తరపున పి గణేష్ కు ఏనుగు గుర్తు కేటాయించారు.భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున పలని చెయ్యి గుర్తు కేటాయించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బత్తలపల్లి విజయ్ కుమార్ కు పంక గుర్తు కేటాయించారు. తెలుగుదేశం పార్టీ తరపున ఎస్. రాజ్ కుమార్ కు సైకిల్ గుర్తు కేటాయించారు. స్వతంత్ర అభ్యర్థులుగా ఎం. నాగరాజుకు ఎయిర్ కండిషనర్ గుర్తు కేటాయించారు. ఎం.మమతకు బీరువా గుర్తు కేటాయించారు. అభ్యర్థులు ఖరారు కావడంతో అభ్యర్థులు ఓటర్లను కలిపి ఓట్లు అభ్యర్థించేందుకు శ్రీకారం చుడుతున్నారు.
కుప్పం మున్సిపల్ పోరులో భారీ ఎత్తున నామినేషన్ల ఉపసంహరణ:కుప్పం మున్సిపల్ ఎన్నికలలో నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. నామినేషన్లు దాఖలు చేసిన వారు ఉపసంహరణ తర్వాత బరిలోని అభ్యర్థుల వివరాలను అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా కుప్పం మున్సిపల్ పరిధిలో వార్డు కౌన్సిలర్లు గాను నామినేషన్ దాఖలు చేసిన వారిలో 120 నామినేషన్లను ఉపసంహరించుకున్నారని తెలిపారు. బిజెపి తరఫున ఫ్రెండ్ నామినేషన్లు తెలుగుదేశం పార్టీ తరపున 46 నామినేషన్లు వైయస్సార్సీపి తరఫున 47 నామినేషన్లను జనసేన తరఫున 11 నామినేషన్లను, ఇండిపెండెంట్ లు 14 నామినేషన్లను ఉపసంహరించుకున్నారని పురపాలక సంఘం కమిషనర్ వి. శ్రీనివాసరావు తెలిపారు.
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి భారీ ఆధిక్యం.కుప్పంలో 32 వార్డులకు గాను 11 వార్డులు టీడీపీ ఏకగ్రీవం అయ్యాయి.
వార్డులు 5, 6, 18, 19, 20, 22, 23, 25, 26, 28, 30 వ వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.ఏకగ్రీవంగా ఎన్నికైన టీడీపీ అభ్యర్థులకు డిక్లరేషన్ ఫారాలను అధికారులు అందజేశారు.5వ వార్డు : అరుణ్ కుమార్,6వ వార్డు : సింగరవేలు,18 వ వార్డు : నందిని మునిస్వామి,19 వ వార్డు : శిరీష ముకేష్ కుమార్,
20 వ వార్డు : కృష్ణన్,
22 వ వార్డు : అశ్వినీ మంజునాథ్,23 వ వార్డు : సుల్తానా జాకీర్,25 వ వార్డు : దామోదర్,26 వ వార్డు: సోమశేఖర్,28 వ వార్డు : భారతి చంద్రశేఖర్,30 వ వార్డు : లావణ్య సురేష్ లు ఏకగ్రీవమయ్యారు.
