ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కుప్పం 11వ క్లస్టర్‌లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం. పథకాలను ప్రజలకు వివరిస్తున్న క్లస్టర్ ఇంచార్జ్...

కుప్పం 11వ క్లస్టర్‌లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం. పథకాలను ప్రజలకు వివరిస్తున్న క్లస్టర్ ఇంచార్జ్ కన్నన్, టిడిపి నేతలు

📰 Generate e-Paper Clip

కుప్పం,ఆగస్టు 04 (గరుడ ధాత్రి న్యూస్):

కుప్పం మున్సిపాలిటీ 11వ క్లస్టర్ పరిధిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో “ఇంటింటికీ తెలుగుదేశం” (డోర్ టు డోర్) కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగుదేశం పార్టీ 11వ క్లస్టర్ ఇంచార్జ్ కన్నన్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించారు.
అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని కన్నన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ జనరల్ సెక్రటరీ నబీవుల్లా, యూనిట్ ఇంచార్జ్ సుభాన్ బాబు, బూత్ ఇంచార్జ్లు ఉమా శంకర్, నాట్టర్ కృష్ణ, ఎక్స్ ఉప సర్పంచ్ సోమశేఖర్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!