రామచంద్రపురం మండలం సీకేపల్లి పంచాయతీ చిట్టత్తూరు గ్రామంలో మంగళవారం గ్రామదేవత నడివీధి గంగమ్మకు గ్రామస్తులు అంబిలి పోసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామం చల్లగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, దుష్టశక్తుల ప్రభావం తొలగి గ్రామ ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని మహిళలు సామూహికంగా నడివీది గంగమ్మ కు ప్రత్యేక పూజలు చేశారు. . ప్రతి ఇంటి నుంచి మహిళలు అంబలిని తయారు చేసి ఊరేగింపుగా గంగమ్మ ఆలయం వద్దకు తీసుకొచ్చి సమర్పించారు. అనంతరం అందరూ తెచ్చిన అంబలిని కలిపి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి, భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు. గ్రామ మహిళల ఐక్యతను ప్రతిబింబించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
గంగమ్మకు చల్లతో ప్రత్యేక పూజలు.. ప్రతి ఇంటి నుంచి అంబలి సమర్పించిన మహిళలు
RELATED ARTICLES
