చౌడేపల్లి సెప్టెంబర్ 28 గరుడ దాత్రి న్యూస్
మండల కేంద్రమైన చౌడేపల్లి లోని ఎస్సీ బాలుర వసతి గృహంలో జాతీయ నాయకులు గుర్రం జాషువా భగత్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహించారు స్థానిక అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్యాంకు రెడ్డప్ప ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా భగత్ సింగ్ గుర్రం జాషువాల జీవిత చరిత్రలను దేశానికి చేసిన వారి సేవలను గుర్తు చేస్తూ వారి అడుగుజాడల్లోనే నడవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి డాక్టర్ చంద్ర బస్టాండ్ సేకర నరసింహులు చంగల్ రాయులు వార్డెన్ సురేష్ విద్యార్థులు పాల్గొన్నారు
