కార్వేటినగరం సెప్టెంబర్ 13 (గరుడదాద్రి న్యూస్)
స్థానిక డీ.ఎం.పురం ఉన్నత పాఠశాలలో జాతీయ భాషా దినోత్సవం (హిందీ దివస్), పవిత్ర వినాయక చవితి పండుగలను పురస్కరించుకుని ఆదివారం సంయుక్త వేడుకలను ఇంచార్జి హెచ్.ఎం సరస్వతి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. రెండు ముఖ్యమైన సందర్భాలు ఒకే రోజు రావడం విశేషమని పేర్కొంటూ పాఠశాల ప్రాంగణంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
పాఠశాల ఇన్‌ఛార్జ్ హెచ్.ఎం సరస్వతి, హిందీ ఉపాధ్యాయురాలు మాలతి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు హిందీ భాష ప్రాముఖ్యతను, వినాయక చవితి విశిష్టతను వివరించారు.దేశ సమైక్యతకు, సాంస్కృతిక బంధానికి జాతీయ భాషగా హిందీ ఎంతగానో దోహదపడుతుందని, అలాగే విఘ్నాలు తొలగించే వినాయకుడి పూజ భారతీయ సంస్కృతికి ప్రతీక అని వక్తలు కొనియాడారు.విద్యార్థులకు రాష్ట్రీయ స్టర్ పర్ హిందీ వ్యాసరచన,చిత్రలేఖనం,కవిత పాట్ పోటీలు నిర్వహించి హిందీ ఉపాధ్యాయిని బహుమతులు అందించారు.విద్యార్థులు సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ, భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) చైర్మన్ త్యాగరాజు, వైస్ చైర్మన్ సంధ్యారాణి, యువ నాయకుడు విజయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉపాధ్యాయులు వ్యాయామ సంచాలకులు కిషోర్ కుమార్, రాములు, అశోక్, హరి, సుమతితో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
