కుప్పం,సెప్టెంబర్ 15 (గరుడ ధాత్రి న్యూస్):
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమరావతిలో మంగళవార ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ సీఎంను కలవడం జరిగింది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా స్థానిక సంస్థ ఎన్నికల బాధ్యతలతో పాటు కుప్పం నియోజకవర్గ బాధ్యతలను డాక్టర్ కంచర్ల శ్రీకాంత్కు ముఖ్యమంత్రి అప్పగించారు. కుప్పం నియోజకవర్గంలో జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో 100 శాతం కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధిష్టానం తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానన్నారు. చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు నాయకులు, కార్యకర్తలతో సమన్వయంగా పనిచేసి రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించినట్లు తెలిపారు.
