ePaper
Monday, September 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిజనసేనపార్టీకార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి రామ్ తల్లూరిని కలిసిన ఏపీ. శివయ్య

జనసేనపార్టీకార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి రామ్ తల్లూరిని కలిసిన ఏపీ. శివయ్య

📰 Generate e-Paper Clip

పూతలపట్టుసెప్టెంబర్ 27: తెలంగాణ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన రాష్ట్ర పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ రామ్ తల్లూరిని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ఏపీ. శివయ్య ఆదివారంమర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగాపూతలపట్టు నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యక్రమాలు, పార్టీ బలోపేతం,నియోజకవర్గంలోని వివిధ అంశాలపై రామ్ తల్లూరితో ఏపీ. శివయ్య చర్చించారు.పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, కార్యకర్తలను సమన్వయం చేసుకోవడం వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు గుర్రం రఘురామ్ చౌదరి, చిరంజీవి జిల్లా అభిమాన సంఘం అధ్యక్షులు పులా ప్రభాకర్, పీఏసీ చైర్మన్ శ్రీనివాసులు, మండల అధ్యక్షులు చిరంజీవి, సుమన్ రాయల్..తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!