* శనివారం ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం ప్రారంభం.
* సంప్రదాయ దుస్తులతో రావాలని విజ్ఞప్తి.
* టిటిడి పాలకమండలి సభ్యులు శాంతారామ్.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 02(ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): పరమ సముద్రం సమీపంలోనే శ్రీ బేటరాయ స్వామి ఉండవద్ద శ్రీవారి కల్యాణోత్సవానికి సర్వం సిద్ధమైందని టీటీడీ పాలక మండలి సభ్యులు శాంతారామ్ తెలిపారు. శనివారం మూడో తేదీన ఉదయం 9 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే శ్రీవారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. శనివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు సుమారు 60 వేల మందికి అన్న ప్రసాద కార్యక్రమాలు మరియు భక్తులకు ప్రసాద వినియోగ కార్యక్రమాలు జరుపబడునని తెలిపారు.
భక్తులకు కుప్పం ఆర్టీసీ బస్టాండ్ నుండి ఆర్టీసీ బస్సులను కూడా నడిపించడం జరుగుతుందన్నారు. మూడు రాష్ట్రాల నుండి విచ్చేస్తున్న భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగినదన్నారు. భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు క కావాలని కోరారు. శ్రీవారి కల్యాణోత్సవంలో పాల్గొనే దంపతులు సంప్రదాయ దుస్తులతో రావాలని విజ్ఞప్తి చేశారు.
