ePaper
Monday, November 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిసీఎం చంద్రబాబు సహకారంతో ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధికి కృషి చేస్తా

సీఎం చంద్రబాబు సహకారంతో ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధికి కృషి చేస్తా

📰 Generate e-Paper Clip

* ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటా.
* సమస్య చెప్పడం మీ వంతు- పరిష్కరించడం నా వంతు.
* ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు.
* కుప్పం మున్సిపల్ టిడిపి అభ్యర్థి ఎస్.రాజ్ కుమార్.
చిత్తూరు బ్యూరో,కుప్పం అక్టోబర్ 31(గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో కుప్పం మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎస్.రాజ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆయన స్వగృహంలో గరుడ ధాత్రి దినపత్రిక ప్రతినిధితో మాట్లాడారు. ఆదివారం జరగనున్న పోలింగ్లో కుప్పం మున్సిపల్ పరిధిలోని ప్రజలందరూ పాల్గొని సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. మున్సిపల్ పరిధిలో అన్ని ప్రాంతాలకు సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. మంచి నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. శ్రీశైలం నుండి కుప్పం నియోజకవర్గంకు హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో నీటి ఎద్దడి నుండి బయటపడ్డామన్నారు. అపర భగీరథుని వలె కృష్ణా జలాలు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతగా ఉందామన్నారు. శ్రీశైలం నుండి కృష్ణా జలాలను తీసుకురావడం ఆషామాషీ కాదని అపర భగీరథుని వలె చంద్రబాబు నాయుడు కృషి చేసి కృష్ణా జలాలు కుప్పం తీసుకువచ్చారన్నారు. కుప్పం రైల్వే గేటు సమీపంలో అత్యధిక వసతులతో స్మశాన వాటికను అభివృద్ధి చేశామన్నారు. కుప్పంలో పచ్చదనాన్ని పెంపొందించామని, విద్యుత్ దీపాలతో కుప్పం ను అలంకరించామన్నారు. ఎన్టీఆర్ స్టేడియం ను కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి చేశామన్నారు. కుప్పం ప్రజల సౌకర్యం రైల్వే సౌకర్యాలను కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారన్నారు. కుప్పం బస్టాండ్ ను 100 కోట్ల పైబడి నిధులతో అత్యాధునిక వసతులతో నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. పట్టణ నడిబొడ్డులోని ఉద్యానవనాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. త్వరలోనే 180 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడతామన్నారు. అన్ని రంగాలలో కుప్పం అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. కుప్పంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కోసం అనేక పరిశ్రమలను ఏర్పాటు చేయిస్తున్నారన్నారు. ఉద్యోగాలకు అవసరమైన శిక్షణను సైతం ఇవ్వడం జరుగుతున్నదన్నారు. కుప్పంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. సంజీవిని ప్రాజెక్టు ద్వారా కుప్పం ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రద్ధ తీసుకుంటున్నారు అన్నారు. కుప్పం మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేసేందుకు తామంతా కృషి చేస్తామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ప్రజలు సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. ప్రతి ఒక్కరూ తనను తమ బిడ్డలుగా భావించి అత్యధిక మెజార్టీలో విజయమందించాలని కోరారు. ఆదివారం జరిగే పోలింగ్కు ప్రజలు తరలివచ్చి సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!