* టీటీడీ జేఈవో ఏ.శరత్.
కుప్పం,సెప్టెంబర్ 28 (గరుడ ధాత్రి ప్రత్యేక ప్రతినిధి): తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తరహాలో ఆకట్టుకునే విద్యుత్ అలంకరణలు చేపట్టాలని టీటీడీ జేఈవో డాక్టర్ ఎ. శరత్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 5 నుంచి 14 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, తిరుచానూరుతో పాటు తిరుపతిలోని ప్రధాన కూడళ్లను సుందరంగా అలంకరించాలని సూచించారు. ముఖ్యంగా గజవాహనం, పంచమి తీర్థం రోజుల్లో పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన క్యూ లైన్లు, బ్యారికేడ్ల ఏర్పాటును ముందస్తుగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని జేఈవో ఆదేశించారు.
