ప్రభుత్వ బడి తెరచి ఆరు రోజులు గడుస్తున్న బడికి రాని పిల్లలు
పట్టించుకొండి జిల్లా విద్యాశాఖ అధికారులు ప్లీజ్.
బైరెడ్డిపల్లిగరుడదాత్రి జూన్17
బైరెడ్డిపల్లి మండలం,
కడపనత్తo ప్రాథమిక పాఠశాల బుధువారం కూడా ఖాళీ గదులతో దర్శనం ఇస్తున్న సంఘటన కొనసాగుతున్నది.
3,4,5 తరగతులు ఇక్కడే కొనసాగించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు చరిత్ర కలిగిన పాఠశాల…200 మంది పై చిలుకు ఉన్నత స్థానాలను అధిరోహించేలా చేసిన పాఠశాల ను ఈ విద్య సంవత్సరం నుండి గ్రామ సమీపంలోని గౌనీతిమ్మినేపల్లి పాఠశాలకు తరలించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీచేశారు.ఈ ఆదేశాలు వద్దని
ఈ పాఠశాలలో35 మంది పిల్లలు ఉన్నారు…మేము ఇక్కడే అయితేనే పంపిస్తామని అంగీకార పత్రం స్థానిక ఎం ఇ ఓ కు తల్లిదండ్రులు రాసి ఇచ్చిన ఫలితం శూన్యం.
మా గ్రామoలోనే 3,4,5 తరగతులు కొనసాగించాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను కలిసి తల్లిదండ్రులు విన్నవించారు…అక్కడ స్పందించినా….మండల,జిల్లా సంబంధిత శాఖ సిబ్బంది స్పందన కరువైందని తల్లిదండ్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బడిలో ఉండాల్సిన పిల్లలు ఇంటికే పరిమితం అవడంపై అధికారులనుగ్రామస్థులు నిలదీస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత శాఖ సిబ్బంది స్పందిస్తే 35 మంది పై చిలుకు పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది అని కడపనత్తం పాఠశాల పై కరుణ చూపండి అని గ్రామస్థులు వేడుకొంటున్నారు.
