-కార్యాలయ సిబ్బంది ఘన స్వాగతం
నాగలాపురం జూన్రు 06 గరుడధాత్రి :
నాగలాపురం మండల నూతన తహసీల్దార్‌గా ఓ.కే. రోజ రాణి శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన హనుమాన్ నాయక్ దక్కిలి మండలానికి బదిలీపై వెళ్లగా, నారాయణవనం తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఓ.కే. రోజ రాణి సాధారణ బదిలీపై నాగలాపురంకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రెవెన్యూ కార్యాలయ సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆహ్వానం పలికారు.
మండల ప్రజలకు పారదర్శకంగా, వేగవంతమైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. అధికారులు, సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
