ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినిధుల కేటాయింపులపై జేసి హర్షం

నిధుల కేటాయింపులపై జేసి హర్షం

📰 Generate e-Paper Clip

నిధుల కేటాయింపులపై జేసి హర్షం

గరుడధాత్రి :
సీఎం చంద్రబాబు రూ.8.5 కోట్లు కేటాయించడంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్ మరమ్మతులకు రూ.8.5 కోట్లు విడుదల! కొన్నేళ్ల నుంచి వేధిస్తున్న తాడిపత్రి సింగనమల రెండు నియోజకవర్గాల మిడ్ పెన్నార్ ప్రాజెక్ట్ లోని సౌత్ కెనాల్ మరమ్మత్ పనులకు సీఎం చంద్రబాబు నిధులు కేటాయించడం ఆనందంగా ఉందని మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. అనంతపురంలోని హెచ్.ఎల్.సి కార్యాలయంలో ఎస్సీ సుధాకర్ రావును రైతులతో కలిశారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు మిడ్ పెన్నార్ ప్రాజెక్టులోని సౌత్ కెనాల్ మరమత్తు పనులకు దాదాపు 8 కోట్ల యాభై లక్షల రూపాయలు నిధులు విడుదల చేశారని తెలిపారు.
ఈ పనులన్నీ ఐఎస్ఓ ప్రమాణాలతో నిర్మించాలని ఎస్సీని కలిసి కోరమన్నారు. జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు కూడా దీనికి సానుకూలంగా స్పందించారన్నారు. కెనాల్ మరమ్మత పనులను నిర్వహించే కాంట్రాక్టర్లు కూడా సొంత ఇంటిని ఎలా నిర్మించుకుంటారో అలాగే పనులు చేయాలని సూచించారు. నాసిరికంగా పనులు చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!