ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిగొర్రెల కాపరిపై ఎలుగుబంటి దాడి కలకలం

గొర్రెల కాపరిపై ఎలుగుబంటి దాడి కలకలం

📰 Generate e-Paper Clip

గొర్రెల కాపరిపై ఎలుగుబంటి దాడి కలకలం

గరుడధాత్రి :
అనంతపురం జిల్లా శేట్టూరు మండలము యర్రబోరేపల్లి గ్రామానికి చెందిన గొల్ల నాగేంద్ర కుమారుడు శ్రీకాంత్‌పై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఈ రోజు ఉదcయం సుమారు పది గంటల సమయంలో నల్లగొండ కొండ ప్రాంతంలో గొర్రెలు మేపుతున్న సమయంలో అకస్మాత్తుగా ఎలుగుబంటి శ్రీకాంత్‌పై దాడి చేసింది. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
అక్కడే ఉన్న రైతులు ఘటనను గమనించి వెంటనే స్పందించి, గాయపడిన శ్రీకాంత్‌ను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులు స్పందించి ఎలుగుబంటి సంచారంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు…

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!