– జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్.
తిరుపతి జిల్లాలో ఈనెల 09వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సోమవారం నాడు నిర్వహించే పి జి ఆర్ ఎస్ కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు వివిధ విధులను నిర్వహిస్తున్నందున జిల్లా వ్యాప్తంగా సోమవారం నాటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు .ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.*
