ePaper
Tuesday, October 27, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్నేత్రపర్వంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలు

నేత్రపర్వంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలు

📰 Generate e-Paper Clip

పౌర్ణమి సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

బైరెడ్డిపల్లి, అక్టోబర్ 25 గరుడధాత్రి :

బైరెడ్డిపల్లిలోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన శ్రీ సత్యనారాయణ స్వామి ఉప ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారి వ్రత పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలు భక్తులకు నేత్రపర్వంగా నిలిచాయి.
ఈ సందర్భంగా అర్చకులు రామకృష్ణమాచార్యులు శాస్త్రోక్తంగా కలశస్థాపన, స్వామివారికి అభిషేకం, సహస్రనామార్చన, అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత కథలను పఠించి వినిపించారు. పూజా కార్యక్రమాల అనంతరం మహామంగళహారతి సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
పౌర్ణమి పర్వదినం సందర్భంగా స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల ఆధ్యాత్మిక సందడితో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!