ePaper
Tuesday, October 27, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బైరెడ్డిపల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గుంతలో ఇరుక్కున్న లారీ

బైరెడ్డిపల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గుంతలో ఇరుక్కున్న లారీ

📰 Generate e-Paper Clip

భారీగా ట్రాఫిక్ జామ్‌.. వాహనదారుల అవస్థలు!

రోడ్డు మరమ్మతులు చేపట్టడంలో అధికారుల నిర్లక్ష్యమే కారణమా?

బైరెడ్డిపల్లి, అక్టోబర్ 25 గరుడదాత్రి :

బైరెడ్డిపల్లి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రహదారిపై ఉన్న గుంతలో లారీ ఇరుక్కుపోవడంతో ఆదివారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరగా, వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చీలంపల్లి దాటి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చింది.
ఇటీవల బెంగళూరు–చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేలో బైరెడ్డిపల్లి సెక్షన్ అధికారికంగా ప్రారంభమైన నేపథ్యంలో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. అయితే, రహదారిపై ఏర్పడిన గుంతలకు సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడం వాహనదారులకు ఇబ్బందిగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ రహదారిపై ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

గుంతలతో ప్రమాదాలు.. ట్రాఫిక్‌తో అవస్థలు..!

జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న రహదారులపై చిన్నచిన్న గుంతలు ఏర్పడినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. రహదారులపై గుంతలను సకాలంలో పూడ్చి, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత శాఖ అధికారులపై ఉందని పేర్కొంటున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారులపై గుంతలకు మరమ్మతులు చేపట్టడంతోపాటు, బైరెడ్డిపల్లిలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!