-మూడు సవరణలు బంగారు ఆభరణాలు అపహరణ
పట్టపగలే గుర్తుతెలియని మహిళ ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి దాడి చేసి బంగారు ఆభరణాలు అపహరించుకెళ్లిన ఘటన శనివారం మధ్యాహ్నం నాగలాపురం బజారు వీధిలో చోటుచేసుకుంది. బాధితురాలు ఉష (72) తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని మహిళ శనివారం ఉదయం నుంచి ఇంటికి ఎదురుగా ఉన్న కాయగూరల దుకాణం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించింది.
మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో ఉష ఇంట్లోకి వెళ్లిన వెంటనే ఆ మహిళ ఇంట్లోకి చొరబడింది. ఆమెపై దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసు, చెవికమ్మలు, అపహరించుకుని పరారైనట్లు బాధితురాలు తెలిపింది. ఉష గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సునీల్ తెలిపారు. నిందితురాలి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
