ePaper
Friday, June 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపిచ్చాటూరు మండలంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

పిచ్చాటూరు మండలంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు, జూన్ 7 గరుడధాత్రి : పిచ్చాటూరు మండలంలో సోమవారం నిర్వహించాల్సిన పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు తెలిపారు.
మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమై ఉండటంతో, సోమవారం జరగాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. తదుపరి పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహణ తేదీని త్వరలో తెలియజేస్తామని తహసీల్దార్ వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!