బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్7
బైరెడ్డిపల్లి మండలం లోని నెళ్లి గ్రామంలో శనివారం రాత్రి గ్రామ దేవత శ్రీ పెద్దపులి గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి శిరస్సు ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది గ్రామ పురవీధుల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, డప్పు వాయిద్యాలు,మంగళ వాయిద్యాలు,భక్తుల కోలాహలం మధ్య ఊరేగించారు. భక్తులు అమ్మవారికి మంగళహారతులు పట్టారు. ఆదివారం తెల్లవారుజామున గ్రామ సంతగేటు వద్ద ప్రతిష్టించారు. మండలంనుంది కాక,కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పొంగళ్ళు చేపట్టి నైవైద్యము గా భక్తి శ్రద్ధలతో సమర్పించారు. మొక్కుబడులు చెల్లించు కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల టి.డి.పి.అధ్యక్షుడు కిషోర్ గౌడు,ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం శెట్టి,పలమనేరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు భువన చంద్ర గౌడు,స్థానిక ,మండల నాయకులు పాల్గొన్నారు.నిర్వాహకులు కిషోర్ గౌడుకు,వారి బృందంకు స్వాగతం పలికి సత్కరించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు.
