ePaper
Friday, October 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతులు

పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతులు

📰 Generate e-Paper Clip

పలమనేరు, అక్టోబర్ 02 ( గరుడ ధాత్రి ) :
రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం భవనంలో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు రత్తారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మహనీయుల సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రత్తారెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ అహింసనే ఆయుధంగా మలచుకున్నారని కొనియాడారు. లాల్ బహదూర్ శాస్త్రి ఆదర్శవంతమైన ప్రధానమంత్రిగా ప్రపంచ దేశాల మన్ననలు పొందారని పేర్కొన్నారు. అనంతరం సుబ్బరాజు గుప్తా ప్రసంగిస్తూ.. గాంధీజీ బాల్యం, విద్యాభ్యాసం, దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షపై ఆయన సాగించిన పోరాటం, నాటి రాజకీయ విలువలు, నిరాడంబర జీవితం గురించి సభికులకు వివరించారు. సంఘం కార్యదర్శి గురుమూర్తి మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత భారత స్వాతంత్ర్య సంగ్రామంలో గాంధీజీ పోషించిన క్రియాశీలక పాత్రను గుర్తుచేశారు. సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలను ముందుండి నడిపించి, దేశానికి స్వాతంత్ర్యం సాధించిపెట్టిన తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు నాగభూషణం, సభ్యులు విజయకుమార్ రెడ్డి, సిద్ధ మనోహర్, విజయ్ కుమార్, సుబ్రహ్మణ్యం, పాపయ్య, శ్యామ్ రాజ్, మురళీధర్, వేణుగోపాల్, శేఖర్, పీటర్, త్యాగరాజ్, దొరస్వామి, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!