పిచ్చాటూరు మే 25 గరుడధాత్రి :
ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న “బడి పిలుస్తోంది” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల విద్యాశాఖాధికారి శ్రీమతి హేమమాలిని సూచించారు. సోమవారం మండల విద్యా కేంద్రము (ఎంఆర్సీ)లో నిర్వహించిన సన్నద్ధత సమావేశంలో ఆమె పాల్గొని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఆర్సీ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
మండల స్థాయిలో జరగబోయే ఈ కార్యక్రమానికి సంబంధించి తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు విద్యార్థుల నమోదు పెంపు, ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలను నిర్వహించాలని ZPHS, MPS, BPS, FS పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు.
ఈ సందర్భంగా సిద్ధిరాజు కండ్రికకు చెందిన రిటైర్డ్ హెడ్‌మాస్టర్ శివప్రసాద్ రుద్రరాజు గారు MPS సిద్ధిరాజు కండ్రిగ పాఠశాలకు రూ.12 వేల విలువైన మైక్ సెట్‌ను విరాళంగా అందజేశారు. ఆయన సేవాభావాన్ని ఎంఈఓ హేమమాలిని అభినందించారు.
