.
* ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పి కే యం ఉడా చైర్మన్ సురేష్ బాబు, సీనియర్ నేత ఆర్. చంద్రశేఖర్. ఏఎంసీ చైర్మన్ రాజు.
కుప్పం, అక్టోబర్ 04 (గరుడ ధాత్రి న్యూస్):ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం కుప్పం బైపాస్ రోడ్ లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి.ఎస్. మునిరత్నం, పి కే ఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, సీనియర్ నాయకులు ఆర్.చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, కుప్పం అర్బన్ పార్టీ అధ్యక్షులు వెంకటేష్, టిడిపి నాయకులు నాగభూషణంలు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో అసెంబ్లీలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో నెం. 105, 1065 జారీ చేస్తే వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని విమర్శించారు.
ఎన్నికలు జరగకూడదు, బీసీలకు రిజర్వేషన్ దక్కకూడదనే కుట్రతో గొడ్డలి పార్టీ నేతలు అడ్డుకున్నారన్నారు.
బీసీలకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు.న్యాయపరంగా ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించి బీసీలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
వైసీపీ హయాంలో 34 శాతం రిజర్వేషన్లను కోర్టు కొట్టివేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లకుండా బీసీలకు చారిత్రాత్మక ద్రోహం చేశారని ఆరోపించారు.
స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న మా సంకల్పం మారదన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు కృషి చేస్తామన్నారు.
34 శాతం రిజర్వేషన్లతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తే రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందనే కుట్రతో గొడ్డలి పార్టీ నేతలు న్యాయస్థానంలో పిటిషన్లు వేసి బీసీలకు తీరని ద్రోహం చేశారన్నారు.
వైసీపీ హయాంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం ఇవ్వకపోవడం వల్ల 16,800 మంది పదవులు కోల్పోయారన్నారు. ఇప్పుడు కూడా పదవులు రాకూడదన్న కుట్రతో కోర్టుకు వెళ్లి నిస్సిగ్గుగా అడ్డుకున్నారన్నారు.అన్ని వర్గాల హక్కులను కాపాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లను బీసీలకు పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్తుంటే గొడ్డలి పార్టీ నేతలు మాత్రం కుట్రలు చేస్తున్నారన్నారు.
బీసీలకు అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేయాలనే అజెండాతో గొడ్డలి పార్టీ నేతలు పనిచేస్తున్నారన్నారు.
వెనుకబడిన వర్గాలను ఓటు బ్యాంకులా చూడాలనే కుట్రతో గొడ్డలి పార్టీ నేతలు ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు.బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములు చేసేందుకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందన్నారు.
సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీల అభ్యున్నతి కోసం మేం ఇచ్చిన మాటపై ఎక్కడా వెనక్కి తగ్గం అన్నారు.హైకోర్టు తీర్పును గౌరవిస్తూ బీసీలకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు.
ఇది కేవలం రిజర్వేషన్ల అంశం మాత్రమే కాదు, బీసీలకు దక్కాల్సిన రాజకీయ ప్రాతినిత్యం అన్నారు.
నాలుగు దశాబ్దాల క్రితమే బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి 1987లో 20 శాతం 1995లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించాం. బీసీలకు రాజకీయ సాధికారత అనేది టీడీపీ డీయన్ఏ లోనే ఉందన్నారు. రాయలసీమను భరతనాల క్షేమంగా చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్కు శ్రీకారం చుట్టారు అన్నారు. త్వరలోనే కుప్పం ఆర్టీసీ డిపోకు కొత్త బస్సులు వస్తాయని, సిబ్బంది నియామకం కు చర్యలు చేపట్టామని వారు విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రాంతీయ వైద్యశాల వైస్ చైర్మన్ భారతి త్రిలోక్ నాయుడు, గంగమ్మ గుడి చైర్మన్ రవిచంద్రబాబు, మున్సిపల్ చైర్మన్ సెల్వ రాజు, కుప్పం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఆర్. శ్రీనివాసులు, బిల్డింగ్ సొసైటీ చైర్మన్ రవి,టిడిపి నాయకులు పాల్గొన్నారు.
