ePaper
Sunday, September 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్భక్తిశ్రద్ధలతో శ్రీ షోడశగౌరీ వ్రతం వేడుకలు

భక్తిశ్రద్ధలతో శ్రీ షోడశగౌరీ వ్రతం వేడుకలు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్13
వినాయక చవితికి ముందు రోజు వచ్చే తృతీయ రోజు వివాహితులు తమ దీర్ఘసుమంగళీత్వం, పుత్ర, పౌత్ర వంశాభి వృద్ధిత్వం, సౌభాగ్యత్వం కోసం చేసే వ్రతమే షోడసగౌరీ వ్రతం. భాద్రపద శుక్లపక్ష తృతీయ ఆదివారం మండల కేంద్రమైన బైరెడ్డిపల్లి లో పురోహితులు మురళీధర్ ఆచార్యులు ఆధ్వర్యంలో స్త్రీలు తమ గృహాలలో షోడశ గౌరీ అమ్మవారిని ప్రతిష్టించుకుని, అమ్మవారికి పంచామృత అభిషేకములు జరిపి తోరములు కట్టుకొని పూజలు నిర్వహించారు. పురోహితులు అమ్మవారి వ్రత కథను చదివి వినిపించారు. ఇంటికి వచ్చిన ముతైదువులకు పసుపుకుంకం,తాంబులాలు పంచిపెట్టారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!