మలేరియా పై అప్రమత్తంగా ఉండాలి
డాక్టర్ విజయ కుమార్
నాగలాపురం, ఏప్రిల్ 25, (గరుడధాత్రి న్యూస్)
ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని శనివారం నాగలాపురం పి.హెచ్.సి వద్ద డాక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ దోమల ద్వారా వ్యాపించే మలేరియాను పూర్తిగా నిర్మూలించుకోవాలని సూచించారు. మలేరియా జ్వరం ప్లాస్మోడియం అనే పరానా జీవి వల్ల వస్తుందని, ఇది ఆడ ఎనాఫిలెస్ దోమ ద్వారా వ్యాధి కలిగిన వ్యక్తి నుండి ఇతర వ్యక్తులకు దోమ కాటు ద్వారా వ్యాప్తి చేస్తుందన్నారు. లక్షణాలు అధిక జ్వరం, తలనొప్పి, తీవ్రమైన చలి, చమటలు పట్టడం, అలసట, ఈ లక్షణాలు కనబడిన వెంటనే డాక్టర్ను సంప్రదించాలన్నారు. రక్త పరీక్ష ద్వార వ్యాధి నిర్ధారణ అవుతుందన్నారు. వెంటనే చికిత్స చేయడం ద్వారా వ్యాధి నయమవుతుంది లేని పక్షంలో ప్రమాదమన్నారు. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా మలేరియా నుండి రక్షణ పొందొచ్చు అన్నారు. దోమ తెరలు వాడుకోవడం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం తద్వారా మలేరియాను అరికట్టవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ్ కిషోర్, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
ఫోటో : ఎన్ జి పి 01. మలేరియా పై అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం
