ePaper
Friday, June 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రతి సోమవారం మండల స్థాయిలో పీజీఆర్‌ఎస్‌ 

ప్రతి సోమవారం మండల స్థాయిలో పీజీఆర్‌ఎస్‌ 

📰 Generate e-Paper Clip

ప్రతి సోమవారం మండల స్థాయిలో పీజీఆర్‌ఎస్‌

ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: తహసీల్దార్‌ చంద్రబాబు

ప్రజల సమస్యలను స్థానిక స్థాయిలోనే సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం ‘పీజీఆర్‌ఎస్‌’ (PGRS – పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పిచ్చాటూరు తహసీల్దార్‌ చంద్రబాబు తెలిపారు. శనివారం ఆయన కార్యాలయం లో మాట్లాడుతు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.చిన్నచిన్న సమస్యల కోసం ప్రజలు జిల్లా కేంద్రంలోని కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, మండల స్థాయిలోనే వాటిని పరిష్కరించేందుకు అధికారులు కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులంతా తప్పనిసరిగా హాజరై, ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరిస్తారని స్పష్టం చేశారు.మండల పరిధిలోని ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి సకాలంలో పరిష్కారం పొందాలని తహసీల్దార్‌ చంద్రబాబు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!