*మహానాడు “భూమిపూజ” మహోత్సవం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల నడుమ మహాసంబరంగా సాగింది.
“శభాష్” అని మెచ్చుకునేలా నెల్లూరు జిల్లాలో మహానాడు ను నిర్వహిస్తాం … నెల్లూరు జిల్లాకు వచ్చిన అద్భుతఅవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం.
*నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించే అదృష్టం కల్పించిన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు.
*మహానాడు భూమిపూజ కార్యక్రమంకు జిల్లా నలువైపుల నుండి తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ధన్యవాదములు.
*– బీద రవిచంద్ర, శాసనమండలి సభ్యులు, జిల్లా టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు
కొడవలూరు మండలం, ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో నిర్వహించ తలపెట్టిన “మహానాడు” కు సంబంధించిన భూమిపూజ కార్యక్రమం ను ఈ రోజు ఉదయం 10 గంటలకు నిర్వహించారు.ముందుగా టెంకాయ కొట్టి ప్రారంభించిన భూమిపూజలో వెంకటగిరి నుండి తెచ్చిన పోలేరమ్మ వారి కుంకుమ, పెంచలకోన గంధంను సమర్పించారు.
ఈ కార్యక్రమంకు రాష్ట్ర పార్టీ నుండి
*ముఖ్య అతిథులు గా సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గుణపాటి దీపక్ రెడ్డి గారు, గ్రంథాలయ రాష్ట్ర ఛైర్మన్ కోటేశ్వరరావు పాల్గొన్నారు
ఈ భూమి పూజ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖామాత్యులు పొంగూరు నారాయణ,దేవాదాయ శాఖామాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, పాశం సునీల్ కుమార్, టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, ఏపీ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఛైర్మన్ డా. జెడ్ శివప్రసాద్, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి,రాష్ట్ర వేతనాల కమిటీ ఛైర్మన్ పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ తహసీన్, పరసా రత్నం, తాళ్లపాక రమేష్ రెడ్డి, తాళ్లపాక అనురాధ, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, జెన్ని రవణయ్య, చెంచలబాబు యాదవ్, ముప్పాళ్ల విజేత, పనబాక భూలక్ష్మి,మామిడాల మధు, కేతంరెడ్డి వినోద్ రెడ్డి, మలిశెట్టి వెంకటేశ్వర్లు,పోతుగంటి అలేఖ్య, తదితరులు పాల్గొన్నారు.
*ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర మాట్లాడుతూ……*
మే 27, 28, 29 తేదీలలో మహానాడు ను నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుండి నేటి వరకు ఇచ్చిన ప్రతి పిలుపును నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు విజయవంతం చేస్తూ వచ్చారు.
మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల సహకారంతో మహానాడు ను విజయవంతం చేస్తాం.
మహానాడు విజయవంతం చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి లు సిద్ధంగా ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ నియమించే కమిటీలతో పాటు ప్రజా ప్రతినిధులు, జిల్లా పార్టీ యంత్రాంగంతో కలిసి సమిష్టిగా నెల్లూరు జిల్లాలో జరిగే మహానాడు ను ప్రతిష్టాత్మకంగా మారుస్తాం.
