తిరుపతి, మే 7 :
మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడంతో పాటు ఆర్థికంగా ఎదిగేందుకు డిజిటల్ మహిళా సంఘం వేదిక కాబోతోందని టిడిపి నగర మహిళా అధ్యక్షురాలు బ్యాంకు శాంతమ్మ తెలిపారు. ఆదివారం తిరుపతిలోని ఒక ప్రైవేటు కల్యాణ మండపంలో డిజిటల్ మహిళా సంఘం ఆధ్వర్యంలో డి ఎం ఎస్ ధన్విత సూపర్ బజార్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బ్యాంకు శాంతమ్మ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారని, భవిష్యత్తులో మహిళలు పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని రంగాలలో ముందుకు వెళుతున్నారన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు డిజిటల్ మహిళా సంఘం నేతృత్వంలోని డీఎంఎస్ తన్విత బజార్ వేదిక కావడం శుభపరిణామం అని చెప్పారు. డిజిటల్ మహిళా సంఘం వ్యవస్థాపకురాలు డాక్టర్ ఆశ్లేష ఈదల మార్గదర్శకత్వంలో తిరుపతి సంఘం అధ్యక్షురాలు పుష్పాంజలి కొత్తపల్లి, ప్రధాన కార్యదర్శి హేమ ప్రియ చామర్తి, గాయత్రి, ట్రైనింగ్ ఆఫీసర్ పవిత్ర సమన్వయం చేశారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో 30 స్టాల్స్ ను మహిళా పారిశ్రామికవేత్తలు,
కోచ్ లు , సైకాలజిస్టులు డిజిటల్ మార్కెటర్లు రియల్ ఎస్టేట్ ఫైనాన్షియల్ రంగాలకు చెందిన మహిళలు పాల్గొని తమ సలహాలు సూచనలను ఇవ్వడంతో పాటు మహిళలు ఆర్థికంగా పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందేందుకు ఇది ఒక పెద్ద వేదిక అని పేర్కొన్నారు. హ్యాండ్ మేడ్ జ్యువెలరీ జ్యూట్ బ్యాగులు ఎంబ్రాయిడరీ ఉత్పత్తులు వస్త్రాలు హస్తకళ వస్తువులు గృహాలంకరణ వస్తువులు ఇంటి తయారీ ఆహార పదార్థాలను ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఆసక్తి కలిగిన వారికి విక్రయాలు జరిపారు. ఆసక్తి కలిగిన మహిళలు ఎవరైనా వ్యాపార రంగంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సందేహాలు, సూచనలు సలహాలు కావాలంటే 7659012246,6305173463 నెంబర్లలో సంప్రదించాలని అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు.
