ePaper
Thursday, June 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిమాతమ్మ తల్లి కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న వెంకటేష్ మేఘల

మాతమ్మ తల్లి కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న వెంకటేష్ మేఘల

📰 Generate e-Paper Clip

నాగలాపురం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని అరుంధతి వాడలో జరిగిన శ్రీ మాతమ్మ తల్లి కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో 14వ వార్డు సభ్యుడు కె. వెంకటేష్ మేఘల పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం రూ.5,000లను విరాళంగా అందజేశారు.
అనంతరం అరుంధతి వాడ గ్రామస్తులు ఆలయ సంప్రదాయాల ప్రకారం కె. వెంకటేష్ మేఘల గారిని ఘనంగా సత్కరించి ఆలయ మర్యాదలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎండి కుమార్, చాంద్ బాషా, పాలిశ్వరన్, వెంకటేష్, రఘు యాదవ్‌తో పాటు అరుంధతి వాడ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అమ్మవారి ఆశీస్సులతో గ్రామంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని భక్తులు ప్రార్థించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!