ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ముఖ్యమంత్రి కుప్పం పర్యటనను విజయవంతం చేద్దాం

ముఖ్యమంత్రి కుప్పం పర్యటనను విజయవంతం చేద్దాం

📰 Generate e-Paper Clip

-టిడిపి 11 వ క్లస్టర్ ఇంచార్జ్ కే.కన్నన్, మాజీ సర్పంచ్ మణి.
– 181,182,183 బూత్ ల పరిధిలో ప్రచారం.
కుప్పం,జులై 02 (గరుడ ధాత్రి న్యూస్):
రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పం ప్రజల ఆశాజ్యోతి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనను విజయవంతం చేద్దామని తెలుగుదేశం పార్టీ కుప్పం అర్బన్ 11వ క్లస్టర్ ఇంచార్జ్ కె.కన్నన్, దలవాయి కొత్తపల్లి మాజీ సర్పంచ్ మణి లు పిలుపునిచ్చారు. గురువారం ఈ మేరకు వారు కుప్పం పురపాలక సంఘం పరిధిలోని దలవాయి కొత్తపల్లి 11వ క్లస్టర్ 181,182, 183 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ఈనెల 4వ తేదీన వంద కోట్ల రూపాయల పైబడి విలువగల నూతన కుప్పం బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని వారు ప్రజలకు వివరించారు. బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగే బహిరంగ సభకు ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నేతలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!