ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మే డే సందర్భంగా నాగలాపురం గ్రీన్ అంబాసిడర్లకు AMC చైర్మన్ జాన్సన్ సన్మానం

మే డే సందర్భంగా నాగలాపురం గ్రీన్ అంబాసిడర్లకు AMC చైర్మన్ జాన్సన్ సన్మానం

📰 Generate e-Paper Clip

*మే డే సందర్భంగా నాగలాపురం గ్రీన్ అంబాసిడర్లకు AMC చైర్మన్ జాన్సన్ సన్మానం*

*నాగలాపురం*ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్యవేడు నియోజకవర్గ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి అదేశాల మేరకు ప్రపంచ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా నాగలాపురం సచివాలయంలో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్లను AMC చైర్మన్ శ్రీ దామోదరం జాన్సన్ గౌరవప్రదంగా సన్మానించారు.

గురువారం సచివాలయ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గ్రీన్ అంబాసిడర్లకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. మహిళా సిబ్బందికి చీరలు, పురుష సిబ్బందికి లుంగీ, టవల్, స్వీట్లు అందించి వారి సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కూటమి సచివాలయ మాజీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, జనరల్ సెక్రటరీ పార్థబన్,స్టేట్ మొదిలియర్ వెల్ఫర్ డైరెక్టర్ నమశ్శివ,జిల్లా సెక్రెటరీ కుమార్,మాజీ సర్పంచ్ తెన్నారసు,AMC డైరెక్టర్ మధు యస్సి సెల్ అధ్యక్షులు నాగరాజ్,జనసేన నాయకులు మోహన్ బాబు,రాజేశ్వరన్, నాగురు, సాయి,దేవ,రూప్,ప్రభు సచివాలయ సిబ్బంది, SI పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాన్సన్ మాట్లాడుతూ, “పారిశుధ్యం అనేది పవిత్రమైన సేవ. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో గ్రీన్ అంబాసిడర్ల పాత్ర కీలకం. వారి కష్టాన్ని గుర్తించి గౌరవించుకోవడం మనందరి బాధ్యత. కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉంది” అని అన్నారు.

పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచడమే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యమని, దానికోసం గ్రీన్ అంబాసిడర్లకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.

 

 

 

 

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!