ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

📰 Generate e-Paper Clip

||తిరుపతి జిల్లా పోలీసు||

తేది: 14.04.2026.

– రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్.,గారు.

 

– రాజ్యాంగ స్ఫూర్తిని పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత – జిల్లా ఎస్పీ.

 

– సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ ఆశయాలు మార్గదర్శకం –జిల్లా ఎస్పీ.

 

– జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో అంబేద్కర్‌ గారికి ఘన నివాళులు

 

– రాజ్యాంగ విలువలను కాపాడటంలో పోలీసుల పాత్ర కీలకం – తిరుపతి ఎస్పీ

 

– తిరుపతి జిల్లా : భారత రాజ్యాంగ శిల్పి, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలొ జరిగిన కార్యక్రమంలొ జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్., గారు ఘనంగా నివాళులు అర్పించారు.

 

– ఈ జయంతిని పురస్కరించుకొని తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి చిత్రపటానికి పోలీస్ అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి గౌరవ నివాళులు సమర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విశిష్ట సేవలను స్మరించుకుంటూ, ఆయన భారత రాజ్యాంగ రూపకల్పనలో పోషించిన కీలక పాత్రను కొనియాడారు. 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మౌ పట్టణంలో జన్మించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు గొప్ప విద్యావేత్త, న్యాయవాది, సామాజిక సంస్కర్తగా దేశానికి అమూల్యమైన సేవలు అందించారని తెలిపారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. అలాగే పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసి, అంటరానితనం, వివక్ష నిర్మూలన కోసం నిరంతరం పోరాటం చేసిన మహానుభావుడిగా అంబేద్కర్ గారు అని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమనే సూత్రాన్ని రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు అందించిన మహోన్నత వ్యక్తిగా ఆయనను కొనియాడారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి ఆలోచనలు, సిద్ధాంతాలు నేటి తరానికి మార్గదర్శకమని, ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ గారు సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీ వెంకట్రావు (పరిపాలన)శ్రీ రవి మనోహర్ ఆచారి (శాంతి భద్రతలు) శ్రీ శ్రీనివాసులు (క్రైమ్స్) మరియు పోలీస్ అధికారులు, ఆర్ఐలు, ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!