ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ సమస్యలు తెలుసుకున్న మండల పార్టీ అధ్యక్షులు : కార్వేటి నగరం జూలై 27 గరుడ దాద్రి న్యూస్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి ఉత్సాహంగా కొనసాగుతోంది. కార్వేటినగరం మేజర్ పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి వివరించారు.
ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తూ, కూటమి ప్రభుత్వం పారదర్శక పాలనతో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందని ఆయన పేర్కొన్నారు. విద్య, వైద్యం, మహిళా సంక్షేమం, రైతు సంక్షేమం, యువత ఉపాధి, మౌలిక వసతుల కల్పన వంటి అనేక రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
అనంతరం స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, వినతులను నమోదు చేసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ విజయాలను వివరించే కరపత్రాలను పంపిణీ చేయడంతో పాటు ప్రజల్లో ప్రభుత్వంపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చెంగల్రా యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి వడియం గాడు రాజా, చిత్తూరు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు రవి యాదవ్, వన్నెకుల క్షత్రియ కార్పొర
రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం
RELATED ARTICLES
