ePaper
Thursday, June 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివిజయవంతం గా నవచేతన శిక్షణ కార్యక్రమం

విజయవంతం గా నవచేతన శిక్షణ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

బాలల భవిష్యత్తుకు పునాది తొలి సంవత్సరాలే: డా. ధనుష్

పిచ్చాటూరు, జూన్ 9: పిచ్చాటూరు మండల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పులింగుంట జెడ్పీ హైస్కూల్‌లో 0-6 సంవత్సరాల పిల్లల కోసం చేపట్టనున్న నవచేతన AI-Enabled ECD Screening కార్యక్రమంపై మండల స్థాయి శిక్షణను మంగళవారం నిర్వహించారు. సీడీపీఓ సౌభాగ్యమ్మ ఆధ్వర్యంలో సూపర్వైజర్లు బజావతి, సుమతి ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిచ్చాటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. ధనుష్, సీహెచ్‌ఓ శివయ్య, ఏఎన్‌ఎమ్ హిమాద్రి, వైద్య సిబ్బంది, భవిత పాఠశాల ఉపాధ్యాయులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డా. ధనుష్ మాట్లాడుతూ పిల్లల జీవితంలో తొలి 1000 రోజులు అత్యంత కీలకమైన అభివృద్ధి దశ అని తెలిపారు. మెదడు అభివృద్ధిలో సుమారు 80 శాతం మూడు సంవత్సరాల లోపే పూర్తవుతుందని, ఈ దశలో పిల్లలపై పెట్టే పెట్టుబడి జీవితాంతం అత్యుత్తమ ఫలితాలను అందిస్తుందని చెప్పారు. పిల్లల విద్య, ఆరోగ్యం, సామాజిక నైపుణ్యాలు, అభ్యాస అవకాశాలకు తొలి సంవత్సరాలే బలమైన పునాదిగా నిలుస్తాయని వివరించారు.
సీడీపీఓ సౌభాగ్యమ్మ మాట్లాడుతూ 0-6 సంవత్సరాల పిల్లల్లో అభివృద్ధి ఆలస్యాలను ప్రారంభ దశలోనే గుర్తించి, సరైన సమయంలో జోక్యం చేసుకునేందుకు నవచేతన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన బాల్యారంభ అభివృద్ధి (ECD) నర్చరింగ్ కేర్, డెవలప్‌మెంట్ స్క్రీనింగ్ ప్రమాణాలను ఆధారంగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పారు. రాష్ట్ర అవసరాలు, ప్రాంతీయ భాష, ఐసీడీఎస్ లక్ష్యాలకు అనుగుణంగా డిజిటల్ స్క్రీనింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, భవిత ఉపాధ్యాయులు, 47 మంది అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!