పాఠశాల విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు
చిత్తూరు ఆగస్టు 1 (గరుడ దాత్రి న్యూస్)
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. శనివారం చిత్తూరు రూరల్ మండలం సిద్ధంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి విద్యా బోధన, పాఠశాలలో సౌకర్యాలు తదితర అంశాలపై ఆరా తీశారు. విద్యార్థుల కోరిక మేరకు పాఠశాలలో సైకిల్ స్టాండ్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. పాఠశాల విద్యార్థుల కోసం నీటి శుద్ధి ప్లాంట్, స్థానిక నాయకులు చంద్ర ప్రకాష్, జయచంద్ర నాయుడుల సహకారంతో పాఠశాలలో స్టేజ్ నిర్మాణం మైక్ సెట్ ఏర్పాటు చేయిస్తామన్నారు. పాఠశాల వద్దనున్న స్థలాన్ని ఆట స్థలంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేసిన సుదీర్ ను అభినందించారు. కార్యక్రమంలో ఎంఈవో సెల్వరాజ్, హెచ్ఎం విజయ్ కుమార్, ఎస్ఎంసీ చైర్మన్ మోహన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
