ePaper
Monday, November 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివిద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

📰 Generate e-Paper Clip

* కేఈసి వైస్ చైర్మన్ డాక్టర్ సునీల్ రాజ్.
* గ్రామీణ విద్యార్థుల క్రీడా ప్రతిభకు కుప్పం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చేయూత.
* డా. వై.సి. జేమ్స్ ఎన్. ప్రభుత్వ రూరల్ పాలిటెక్నిక్‌కు రూ.60 వేల విలువైన స్పోర్ట్స్ కిట్ అందజేత.
చిత్తూరు బ్యూరో,కుప్పం నవంబర్ 02 (గరుడ ధాత్రి న్యూస్):విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఎంతో అవసరమనే గొప్ప సంకల్పంతో కుప్పం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో డా. వై.సి. జేమ్స్ ఎన్. ప్రభుత్వ రూరల్ పాలిటెక్నిక్ కళాశాలకు సుమారు రూ.60 వేల విలువైన స్పోర్ట్స్ కిట్‌ను కుప్పం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తరఫున అందజేశారు.
ఈ క్రీడా సామగ్రిని కుప్పం ఇంజనీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ డా. ఎన్. సునీల్ రాజ్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలు, జట్టుగా పనిచేసే మనస్తత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తగిన క్రీడా సదుపాయాలు కల్పించడం ద్వారా వారిలోని ప్రతిభను ప్రోత్సహించవచ్చని తెలిపారు.కుప్పం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ డా. బి.సి. నాగరాజ్ దూరదృష్టి, సేవాభావం మరియు విద్యాభివృద్ధి పట్ల అంకితభావానికి ఈ కార్యక్రమం మరో నిదర్శనంగా నిలిచింది. విద్యాసంస్థల అభివృద్ధితో పాటు సమాజంలోని ఇతర విద్యాసంస్థలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం, గ్రామీణ విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడం ట్రస్ట్ ప్రధాన లక్ష్యాలలో ఒకటిగా కొనసాగుతోంది.కేవలం విద్యను అందించడమే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన అవకాశాలను సృష్టిస్తూ, సమాజ అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న కుప్పం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని పలువురు ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ డా. ఎస్. సుధాకరబాబు,డా .ఎం.జగన్నధ రావ్, హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ విభాగాధిపతి జె. మాధవన్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గంగాధరన్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా. అరుణ్ కుమార్, పిడి సతీష్ కుమార్, పి ఆర్ ఓ ప్రవీణ్ కుమార్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!