ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్శ్రీ వేదనారాయణ స్వామివారికి ఘనంగా ఉయ్యాల సేవ

శ్రీ వేదనారాయణ స్వామివారికి ఘనంగా ఉయ్యాల సేవ

📰 Generate e-Paper Clip

నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో శనివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారికి ఘనంగా ఉయ్యాల సేవ నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేపట్టారు. అందంగా అలంకరించిన ఉయ్యాల లో ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి ఉయ్యాల సేవ నిర్వహించారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సేవ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది. భజనలు, మంగళ వాయిద్యాల నడుమ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో సాగింది. చివరగా భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!