* పచ్చదనం,పరిశుభ్రత పనులను పరుగులు పెట్టిస్తున్న కమిషనర్ వి. శ్రీనివాసరావు.
* చెత్తా,చెదారం, ప్లాస్టిక్ పై ప్రజల్లో చైతన్యానికి ప్రాధాన్యం.
* చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా కుప్పం మున్సిపల్ పరిధిలో పనులు.
కుప్పం, సెప్టెంబర్ 20(గరుడ ధాత్రి న్యూస్):రాష్ట్రంలోనే రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం లో సుందర కుప్పం కోసం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా కుప్పం పురపాలక సంఘం పరిధిలో కుప్పం సుందరీకారణ పనులు జోరుగానే జరుగుతున్నాయి. కుప్పం పురపాలక సంఘం కమిషనర్ వి. శ్రీనివాసరావు పురపాలక పరిధిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. కుప్పం పురపాలక సంఘం కమిషనర్ గా శ్రీనివాసరావు వచ్చాకే కుప్పం పురపాలికలో కదలిక వచ్చింది. మున్సిపల్ పరిధిలోని అన్ని అంశాలపై పట్టు కలిగిన అధికారి అయిన కమిషనర్ శ్రీనివాసరావు పురపాలికలో ప్రగతిని పరుగులు తీయించేందుకు కృషి ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటైన కుప్పం ఏరియా డెవలప్మెంట్ ఆథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి అయిన వికాస్ మర్మత్, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో కుప్పంను సుందర కుప్పం గా తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రధానంగా కుప్పం పురపాలక సంఘం పరిధిలో పచ్చదనం, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. పట్టణ ప్రధాన రహదారిలోనూ ముఖ్యమైన ప్రదేశాలలోనూ పచ్చని చెట్లు అలరారే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ఇళ్లలోని చెత్తాచెదారాలను రోడ్లపై పడవేయకుండా, మురుగునీటి కాలువలలో వేయకుండా మున్సిపాలిటీ చెత్త సేకరణ వాహనాలలోనే ప్రజలు
చెత్తను ఇచ్చే విధంగా కృషి సల్పి సఫలీకృతులయ్యారు. పురపాలక సంఘం పరిధిలో ఎన్నో ఏళ్ల క్రితం పూడిపోయిన మురుగునీటి కాలువలను గుర్తించి బాగు చేయించారు. అన్ని కాలువలలోను పూడికలను తొలగింప చేయించారు. వీధి దీపాలను చూడచక్కగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. తొలుత అధికారులతో దుకాణదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. తర్వాత పెనాల్టీలు విధించడం ప్రారంభించారు. మటన్,చికెన్ దుకాణాల వద్ద పారిశుద్ధ్య పనులను నిర్దేశించారు. హెూటలలో ప్రజలకు నాణ్యమైన ఆహారం లభించేందుకు ఆదేశాలు ఇచ్చారు. హెూటళ్లను తనిఖీ నిర్వహించారు. నాణ్యమైన ఆహారం విషయంలో రాజీ పడేది లేదని హెచ్చరించారు. వార్డులలో మహిళల ఆరోగ్యం కోసం ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. వీలున్నప్పుడల్లా వార్డులలో మకాం వేసి ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. తరచూ సచివాలయాలను తనిఖీ నిర్వహిస్తున్నారు. మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగా కుప్పం వులపాలికలో పనులను కొనసాగిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఇంటిని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సామూహిక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలమని సూచిస్తున్నారు. నిర్దేశిత రోజులలో దోమల నివారణకు మందును పిచికారి చేయిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వీలున్నప్పుడల్లా వార్డులలో పర్యటిస్తూ ప్రజలను కలిసి విషయాలను వాకపు చేస్తున్నారు. మున్సివల్ పరిధిలో అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు. కుప్పం పురపాలక సంఘం కమిషనర్ వి. శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ప్రతిష్టాత్మక స్వపు ఆంధ్ర ఆవార్డును అందుకున్నారు. 2025 ఈ ప్రతిష్టాత్మక అవార్డును రాష్ట్ర నాయుడు చేతులమీదుగా కమిషనర్ వి. శ్రీనివాసరావు అందుకున్నారు. కుప్పం బైపాస్ రోడ్ లోని పై ఓవర్ బ్రిడ్జి పైన పారిశుద్ద పనులను చేయించారు.రహదారికేరువైపులా రకరకాల చెట్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే విద్యుత్ దీపాల అలంకరణ కూడా పూర్తి చేశారు. దీంతో ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైన ఆహ్లాదకర వాతావరణం పరచుకుంది. కుప్పం లోని శివాలయం వద్ద ఉన్న కుప్పం చెరువు వద్ద సుందరీకరణ పనులు నిర్వహిస్తున్నారు. చెరువుకు ఫెన్సింగ్ వేయించారు. చెరువు చుట్టూ లైట్లు అమరుచారు. పచ్చదనం పరిచారు. ఎక్కడ చెత్తాచెదారం లేకుండా చర్యలు తీసుకున్నారు. తరచూ పాఠశాలల్లో విద్యార్థులను చైతన్య పరుస్తూ తడి పొడి చెత్త ల గురించి వివరిస్తున్నారు. మొత్తం మీద కుప్పం పులపాలక సంఘం పరిధిలోని ప్రజలు పురపాలక సంఘం పనితీరుపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సుందర కుప్పం దిశగా అభివృద్ధి పనులు
RELATED ARTICLES
