ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిగంగవరం సచివాలయంలో 'డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్' తనిఖీ

గంగవరం సచివాలయంలో ‘డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్’ తనిఖీ

📰 Generate e-Paper Clip

పలమనేరు, జులై 20 ( గరుడ ధాత్రి ) :
గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గంగవరం సచివాలయంలో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి విచ్చేసిన ‘డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్’ బృందం విస్తృత తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా సచివాలయ పరిధిలోని గర్భవతులు, చిన్నపిల్లలకు అందుతున్న వైద్య సేవల వివరాలను బృందం సభ్యులు క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రం నుంచి వచ్చిన అధికారులు సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. వైద్యారోగ్య శాఖ ద్వారా అందించే ప్రతి సేవను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రికార్డుల నిర్వహణపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు. పిహెచ్‌సి రికార్డులను సమగ్రంగా పరిశీలించిన టాస్క్ ఫోర్స్ బృందం, రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారి జార్జి, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ రామ్మోహన్, ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కోఆర్డినేటర్ మంజునాథ్, మండల ప్రధాన వైద్యులు డాక్టర్ శ్రీనివాసులు, వైద్యురాలు డాక్టర్ లహరి, పిహెచ్‌సి సిబ్బంది జ్యోతిశ్వర్ మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!