ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికె ఈ సి బి.టెక్ ఫలితాల టాపర్ల జాబితా విడుదల

కె ఈ సి బి.టెక్ ఫలితాల టాపర్ల జాబితా విడుదల

📰 Generate e-Paper Clip

కుప్పం,జులై 20 (గరుడ ధాత్రి న్యూస్):
కుప్పం ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన బి.టెక్2 సెమిస్టర్ ఏప్రిల్–2026పరీక్షల టాపర్ల జాబితాను విశ్వవిద్యాలయ నామినీ చేతుల మీదుగా అధికారికంగా విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విద్యార్థుల కృషి, అధ్యాపకుల నిబద్ధత, తల్లిదండ్రుల సహకారంతో కళాశాల ఉత్తమ ఫలితాలను సాధిస్తోందని తెలిపారు. టాపర్లను అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.
బి.టెక్ 2సంవత్సరం 2 సెమిస్టర్ (సీఎస్ఈ) టాప్–3 విద్యార్థులు:
ప్రథమ స్థానం: భావనా సి – 94.33శాతం,ద్వితీయ స్థానం: జి. ఉమాశ్రీ – 93.00శాతం, తృతీయ స్థానం: ఎస్. సంజన – 92.44శాతం సాధించారు.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ నామినీ టాపర్లను అభినందిస్తూ, విద్యార్థులు విద్యతో పాటు నైపుణ్యాలను కూడా పెంపొందించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, విభాగాధిపతులు మరియు అధ్యాపకులు టాపర్లతో పాటు ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ, రానున్న సెమిస్టర్లలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!