ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఅక్రమ ఇసుక, గ్రావెల్ రవాణాపై ఎస్సై రాఘవేంద్ర హెచ్చరిక

అక్రమ ఇసుక, గ్రావెల్ రవాణాపై ఎస్సై రాఘవేంద్ర హెచ్చరిక

📰 Generate e-Paper Clip

-ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లకు కౌన్సిలింగ్

పిచ్చాటూరు, జూలై 21 గరుడధాత్రి :
పిచ్చాటూరు మండలంలో అక్రమ ఇసుక, గ్రావెల్ రవాణాను అరికట్టే చర్యల్లో భాగంగా పిచ్చాటూరు ఎస్సై బి. రాఘవేంద్ర ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లకు హెచ్చరిక జారీ చేశారు.
స్థానిక ఐసీసీ గ్రౌండ్‌లో మండలంలోని ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లను వారి వాహనాలతో సహా పిలిపించి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్, రవాణా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
అక్రమ ఇసుక, గ్రావెల్ రవాణాకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై స్పష్టం చేశారు. అలాగే ప్రతి ట్రాక్టర్‌కు రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, రోడ్డు భద్రతా నిబంధనలు, ఇతర జాగ్రత్తలు పాటించాలని అవగాహన కల్పించారు.
ప్రజల భద్రతతో పాటు అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని ఎస్సై తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!