ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిజీవనోపాదుల సేవా కేంద్రం ప్రారంభించిన పి డిడి ఆర్ డిఏ. టి ఎన్.శోభన్ బాబు

జీవనోపాదుల సేవా కేంద్రం ప్రారంభించిన పి డిడి ఆర్ డిఏ. టి ఎన్.శోభన్ బాబు

📰 Generate e-Paper Clip

నారాయణవనం జూలై 23 (గరుడదాత్రి న్యూస్)

మండలంలోని అరణ్యకండ్రిగ సమీక్రుత వ్యవసాయ క్లస్టర్ నందు జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్, సెర్ప్ సంయుక్తంగా ఏఫ్ఈ ఓ సహాయంతో జీవనోపాదుల సేవా కేంద్రం పిడి డిఆర్డిఏ పీఎం శోభన్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా రైతులను ఉద్దేశించి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు టి.ఎన్ శోభన్ బాబు మాట్లాడుతూ సమీకృత వ్యవసాయ విధానాలు చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగంగా ఉంటుందని తెలిపారు.
ఖర్చులు తగ్గించి రైతులు ఆదాయం పెంచుకొనేందుకు మగ్గిన పశువుల ఎరువు,
కోళ్ల,గొర్రెలు, మేకల ఎరువు, జీవ సూక్ష్మజీవులు, బయోఫర్టిలైజర్లు విరివిగా వాడాలని తెలిపారు.త్వరలో కస్టమర్ హైరింగ్ సెంటర్ ఏర్పాటుచేసి యంత్రాల సేవలను అందిస్తామని తెలిపారు.రైతు ఉత్పత్తిదారుల సంస్థతో జీవనోపాది సేవా కేంద్రాల ద్వారా స్ప్రేయర్లు, టార్పాలిన్లు,పనిముట్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఏపి డి పి. ప్రభావతి మాట్లాడుతూ
బయో రిసోర్స్ సెంటర్లు ఏర్పాటు చేసి వాటిలో ఘన, ద్రవ జీవామృతం
శనిగపిండి,వేపపిండి,ఆముదం పిండి,ఆవాల పిండి,వరి పొట్టు, వర్మీ కంపోస్ట్,సహజ పద్దతిలో పంటలకు అవసరమైన వాటిని కొనుగోలు చేసుకొని వాడాలని తెలిపారు.జీవనోపాధి సేవాకేంద్రం పరిధిలోని మార్గదర్శకo గా వివిధ రకాల పంటలను అరణ్య కండ్రిగ సమీకృత వ్యవసాయ క్లస్టర్లో చేపట్టెందుకు రైతులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.మండల పరిషత్ అభివృద్ధి అధికారిని అరుణ మాట్లాడుతూ వర్మీ కంపోస్టుతో పెరటి తోటలు నూట్రి గార్డెన్స్ ఏర్పాటు చేసుకుని పండ్లు కూరగాయలు పొందాలని తెలిపారు. బిబిజి రాంజీ పథకం కింద పండ్ల తోటలు మునగ చెట్టు పెంచి ఆదాయం పొందాలని సూచించారు. వ్యవసాయ అధికారి గోపికృష్ణ మాట్లాడుతూ
ఏపీ సీ ఎన్ ఎఫ్ వారి సహకారంతో కాషాయలు, ఘనజీవామృతం ద్రవ జీవం అమృతమును వాడి పంటలను రక్షించుకోవాలని తెలిపారు.వెటర్నరీ డాక్టర్ భార్గవి, లక్ష్మీపార్వతి మాట్లాడుతూ
పశుసంవర్ధక శాఖ ద్వారా అన్ని రకాల సేవలను రైతులకు అందించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సింగల్ విండో డైరెక్టర్ కె విజయకుమార్, ఏపిఎం టి. ధనంజయ రెడ్డి,స్త్రీ నిది మేనేజర్ ఆదిలబాషా,ఏఫ్ ఈ ఓ అధ్యక్షులు సిందూరి , సిసిలు రాజేశ్వరి, నిమ్మి, అరున్ కుమార్,పంచాయతీ కార్యదర్శి సుజన,ఐ ఏఫ్ సి యాంకర్ పర్సన్ మౌనిక,అకౌంటెంట్ మల్లిక, సిఆర్ పిలు, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!