ఐరాల కాణిపాకం జూలై 24 (గరుడ ధాత్రి న్యూస్):
గదుల కోసం లాడ్జిల్లో దిగే అతిధుల సరైన గుర్తింపు పత్రాలను పరిశీలించాకే గదులు కేటాయించాలని కాణిపాకం ఎస్ఐ నరసింహ యాదవ్ సూచించారు. గురువారం ఆయన తన సిబ్బందితో కలిసి కాణిపాకం పరిధిలోని వివిధ లాడ్జ్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాడ్జ్‌లలో బస చేస్తున్న అతిథుల వివరాలు, గుర్తింపు పత్రాల నమోదు, అతిథి రిజిస్టర్ నిర్వహణ, సీసీటీవీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లు ఇతర చట్టపరమైన నిబంధనల అమలును పరిశీలించారు. అతిథుల పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, సరైన గుర్తింపు పత్రాలు పరిశీలించిన అనంతరం మాత్రమే గదులు కేటాయించాలని సూచించారు. అదేవిధంగా లాడ్జ్‌లలో సీసీటీవీ వ్యవస్థలను ఎల్లప్పుడూ పనిచేసే స్థితిలో ఉంచాలని, రికార్డులను భద్రపరచాలని, ప్రభుత్వ నిబంధనలు, చట్టాలను ఖచ్చితంగా పాటించాలని యాజమాన్యాలకు హెచ్చరికలు సూచనలు ఇచ్చారు. ప్రజల భద్రత, నేరాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు. ప్రజలు కూడా అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలన్నారు. ఇతనికెల్లో ఆయనతోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
